Mar 14,2023 16:21

ముంబై : మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభంకాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తల్లి మరణాంతర కార్యక్రమాలు జరిపించేందుకు కమిన్స్‌ స్వదేశంలోనే ఉండిపోనున్నాడు. దీంతో అతని గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ ఆస్ట్రేలియా సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మార్చి 14) అధికారికంగా ప్రకటించింది.
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు :  డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), మార్నస్‌ లబూషేన్‌, మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టొయినిస్‌, అలెక్స్‌ క్యారీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కెమరూన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, సీన్‌ అబాట్‌, అస్టన్‌ అగర్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా