- అక్టోబర్ 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో షురూ
- 15న అహ్మదాబాద్‌లో భారత్‌ాపాకిస్తాన్ మ్యాచ్
- ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు
దుబాయ్: ఐసిసి వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో 13వ ఐసిసి వన్డే ప్రపంచకప్ టోర్నీ సమరం మొదలుకానుంది. టైటిల్‌కై మొత్తం 10జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో 9మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-4లో ఉన్న జట్లు సెమీఫైనల్స్ ఆడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య హై-టెన్షన్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్, అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. రెండు సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే(నవంబర్ 20) ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టేడియంకు ఒక్క మ్యాచ్‌నూ కేటాయించలేదు. ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణె, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికలుగా మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఐసిసి ఆ ప్రతిపాదనను త్రోసిపుచ్చి షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరగనున్నట్లు ప్రకటించింది. 1987లో భారత్-పాకిస్తాన్, 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కలిసి సంయుక్తంగా ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యమివ్వగా.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఐసిసి ప్రపంచకప్ షెడ్యూల్..
అక్టోబర్ 5 ఇంగ్లండ్ × న్యూజిలాండ్ అహ్మదాబాద్
6(శుక్ర) పాకిస్తాన్ × క్వాలిఫయర్1 హైదరాబాద్
7(శని) బంగ్లాదేశ్ × ఆఫ్ఘనిస్తాన్ ధర్మశాల
దక్షిణాఫ్రికా × క్వాలిఫయర్‌ా2 ఢిల్లీ
8(ఆది) ఇండియా × ఆస్ట్రేలియా చెన్నై
9(సోమ) న్యూజిలాండ్ × క్వాలిఫయర్1 హైదరాబాద్
10(మంగళ) ఇంగ్లండ్ × బంగ్లాదేశ్ ధర్మశాల
11(బుధ) ఇండియా × ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ
12(గురు) పాకిస్తాన్ × క్వాలిఫయర్‌ా2 హైదరాబాద్
13(శుక్ర) ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా లక్నో
14(శని) ఇంగ్లండ్ × ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ
న్యూజిలాండ్ × బంగ్లాదేశ్ చెన్నై
15(ఆది) ఇండియా × పాకిస్తాన్ అహ్మదాబాద్
16(సోమ) ఆస్ట్రేలియా × క్వాలిఫయర్2 లక్నో
17(మంగళ) దక్షిణాఫ్రికా × క్వాలిఫయర్1 ధర్మశాల
18(బుధ) న్యూజిలాండ్ × ఆఫ్ఘనిస్తాన్ చెన్నై
19(గురు) ఇండియా × బంగ్లాదేశ్ పూణే
20(శుక్ర) ఆస్ట్రేలియా × పాకిస్తాన్ బెంగళూరు
21(శని) ఇంగ్లండ్ × దక్షిణాఫ్రికా ముంబయి
క్వాలిఫయర్‌ా1 × క్వాలిఫయర్2 లక్నో
22(ఆది) ఇండియా × న్యూజిలాండ్ ధర్మశాల
23(సోమ) పాకిస్తాన్ × ఆఫ్ఘనిస్తాన్ చెన్నై
24(మంగళ) దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్ ముంబయి
25(బుధ) ఆస్ట్రేలియా × క్వాలిఫయర్1 ఢిల్లీ
26(గురు) ఇంగ్లండ్ × క్వాలిఫయర్2 బెంగళూరు
27(శుక్ర) పాకిస్తాన్ × దక్షిణాఫ్రికా చెన్నై
28(శని) క్వాలిఫయర్‌ా1 × బంగ్లాదేశ్ కోల్‌కతా
ఆస్ట్రేలియా × న్యూజిలాండ్ ధర్మశాల
29(ఆది) ఇండియా × ఇంగ్లండ్ లక్నో
30(సోమ) ఆఫ్ఘనిస్తాన్ × క్వాలిఫయర్‌ా2 పూణే
31(మంగళ) పాకిస్తాన్ × బంగ్లాదేశ్ కోల్‌కతా
నవంబర్
1(బుధ) న్యూజిలాండ్ × దక్షిణాఫ్రికా పూణే
2(గురు) ఇండియా × క్వాలిఫయర్‌ా2 ముంబయి
3(శుక్ర) క్వాలిఫయర్‌ా1 × ఆఫ్ఘనిస్తాన్ లక్నో
4(శని) ఇంగ్లండ్ × ఆస్ట్రేలియా అహ్మదాబాద్
న్యూజిలాండ్ × పాకిస్తాన్ బెంగళూరు
5(ఆది) ఇండియా × దక్షిణాఫ్రికా కోల్‌కతా
6(సోమ) బంగ్లాదేశ్ × క్వాలిఫయర్2 ఢిల్లీ
7(మంగళ) ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్తాన్ ముంబయి
8(బుధ) ఇంగ్లండ్ × క్వాలిఫయర్1 పూణే
9(గురు) న్యూజిలాండ్ × క్వాలిఫయర్‌ా2 బెంగళూరు
10(శుక్ర) దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్తాన్ అహ్మదాబాద్
11(శని) ఇండియా × క్వాలిఫయర్1 బెంగళూరు
12(ఆది) ఇంగ్లండ్ × పాకిస్తాన్ కోల్‌కతా
ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్ పూణే
15(బుధ) సెమీఫైనల్-1 ముంబయి
16(గురు) సెమీఫైనల్-2 కోల్‌కతా
19(ఆది) ఫైనల్ అహ్మదాబాద్
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్
అక్టోబర్
8(ఆది) ఇండియా × ఆస్ట్రేలియా చెన్నై
11(బుధ) ఇండియా × ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ
15(ఆది) ఇండియా × పాకిస్తాన్ అహ్మదాబాద్
19(గురు) ఇండియా × బంగ్లాదేశ్ పూణే
22(ఆది) ఇండియా × న్యూజిలాండ్ ధర్మశాల
29(ఆది) ఇండియా × ఇంగ్లండ్ లక్నో
నవంబర్
2(గురు) ఇండియా × క్వాలిఫయర్2 ముంబయి
5(ఆది) ఇండియా × దక్షిణాఫ్రికా కోల్‌కతా
11(శని) ఇండియా × క్వాలిఫయర్1 బెంగళూరు










