May 06,2023 22:10

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16లో నిరాశపరుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్ట్జే ఈ సీజన్‌ ఐపిఎల్‌ మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన నోర్ట్జే వ్యక్తిగత కారణాల కారణంగా స్వదేశానికి వెళ్తున్నట్లు ఆ ఫ్రాంచేజీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నోర్ట్జే శుక్రవారం రాత్రి దక్షిణాఫ్రికాకు బయల్దేరాడని, దీంతో బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా అతని పేరును జట్టు ఎంపికకు పరిశీలనలోకి తీసుకోలేదని ఆ ఫ్రాంచైజీ పేర్కొంది. ఇక ఈ సీజన్‌లో నోర్ట్జే ఢిల్లీ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఢిల్లీ జట్టు తొమ్మిది మ్యాచుల్లో ఆరు పాయింట్లతో పట్టికలో చివరిస్థానంలో ఉంది.