బెంగళూరు: దులీప్ ట్రోఫీ గెలుపుకు చేరువలో నార్త్, సెంట్రల్ జోన్ జట్లు నిలిచాయి. చిన్నస్వామి స్టేడియంలో నార్త్‌జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 259పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో నార్త్ ఈస్ట్‌జోన్ జట్టు 666పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్‌జోన్ జట్టు 3వికెట్ల నష్టానికి 58పరుగులు చేసింది. కిషన్(14), జోసెఫ్(7), కిషాంగ్బామ్(13) ఔటయ్యారు. క్రీజ్‌లో ఫల్జోర్(13), నీలేశ్(5) ఉన్నారు. చివరిరోజు నార్త్ ఈస్ట్‌జోన్ జట్టు 608పరుగులు చేయాల్సి ఉండగా.. నార్త్‌జోన్ జట్టు మరో 7వికెట్లు పడగొడితే విజయం ఖాయం కానుంది.
ఆలూరు కస్కా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టు గెలుపుకు చేరువలో నిలిచింది. ఈస్ట్‌జోన్ జట్టు 300పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి మూడోరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్లు కోల్పోయి 69పరుగులు చేసింది. క్రీజ్‌లో రియాన్ పరాగ్(6), మణిశంకర్(0) ఉన్నారు. సౌరభ్ కుమార్‌కు నాలుగు, కెప్టెన్ శివమ్ మావి, ఆవేశ్ ఖాన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా)..
నార్త్ జోన్ 540/8డిక్లేర్డ్, 259/6డిక్లేర్డ్
నార్త్ ఈస్ట్‌జోన్ 134, 58/3
సెంట్రల్ జోన్ 182, 239
ఈస్ట్‌జోన్ 122/9, 69/6










