Sep 11,2023 21:21

ముంబయి : నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ-50 ఓ దశలో 20,008 గరిష్ట స్థాయికి ఎగిసింది. తుదకు 176 పాయింట్లు లేదా 0.89 శాతం పెరిగి 19,996 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 528 పాయింట్లు రాణించి 67,127 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, యుపిఎల్‌ షేర్లు అదికంగా లాభపడిన వాటలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 1.2 శాతం, 0.7 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో పిఎస్‌యు బ్యాంకింగ్‌ సూచీ 3 శాతం పెరగ్గా.. లోహ, ఆటో సూచీలు 1.7 శాతం చొప్పున పెరిగాయి. ఢిల్లీలో నిర్వహించిన జి20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్లలో విశ్వాసం పెరిగిందని బ్రోకర్లు పేర్కొన్నారు.