Oct 27,2022 20:31

ముంబయి : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హెచ్‌యుల్‌ కొత్తగా పూరిట్‌ పేరుతో నూతన వాటర్‌ ప్యూరిఫైయర్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవి పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు వంటి విషపదార్థాలను, వ్యాధికారకాలను తొలగించి.. సురక్షితమైన నీటిని అందిస్తాయని ఆ కంపెనీ తెలిపింది. వీటిని అంతర్జాతీయ ప్రయోగశాలల్లో పరీక్షించినట్లు తెలిపింది. ప్యూరిట్‌ విటల్‌ సీరిస్‌ ఉత్పత్తులు రూ.13,999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.