Apr 13,2023 21:38

న్యూఢిల్లీ: దోహా వేదికగా మే 5నుంచి జరిగే డైమండ్‌ లీగ్‌తో మళ్లీ బరిలోకి దిగనున్నట్లు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన నీరజ్‌ చోప్రా.. ఆ తర్వాత ప్రాక్టీస్‌కే పరిమితమయ్యాడు. 25ఏళ్ల నీరజ్‌ చోప్రా గత డైమండ్‌ లీగ్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నీరజ్‌ చోప్రా కెరీర్‌ బెస్ట్‌ త్రో 89.94మీటర్లు. 2022 డైమండ్‌ లీగ్‌లో ఆండరన్‌ పీటర్స్‌(గ్రెనెడా) 93.07మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలుచుకోగా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన జాకోబ్‌ వాడ్లేజ్‌(చెక్‌ రిపబ్లిక్‌) 90.88మీ. నీరజ్‌ కంటే ముందున్నారు. అలాగే కెన్యాకు చెందిన 2016 ఒలింపిక్స్‌ రజిత పతక విజేత జులెస్‌ యోగో(కెన్యా) 92.72మీ. కూడా డైమండ్‌ లీగ్‌లో బరిలోకి దిగనున్నారు.