ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్య జిల్లా) : సావిత్రీ భారు పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరిచుకుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మలంగ్ షా వలి, అనిత మాట్లాడుతూ.. సావిత్రిబాయి ఫూలే సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అని కొనయాడారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.










