Jan 22,2023 12:36

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని కృష్ణా - గుంటూరు ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధమ కౌన్సిల్‌ సమావేశం ఆదివారం నందిగామలో ప్రారంభమైంది. ముఖ్య అతిధులుగా ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు, నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్‌, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కఅష్ణ,మాజీ ఎంఎల్సి బడ్డు నాగేశ్వరరావు, సౌజీవరెడ్డి, సుందరయ్య, పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గన్నారు. ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ... విద్యను ప్రైవేటీకరణ చేయటానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. ప్రభుత్వం యధావిధిగా ఎలిమెంటరీ పాఠశాలలను కొనసాగించాలన్నారు. ఎయిడ్‌ కాలేజిలు రద్దు చేసే ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని కోరారు. సిపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ పిఎస్‌ హరనాధరెడ్డి, జిల్లా కౌన్సిలర్‌ కుంచం లక్ష్మీ నారాయణ, పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.