Jan 17,2023 17:21

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్యజిల్లా) : ప్రజాశక్తి క్యాలెండర్‌ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం నగిరిపల్లిలోని కిషోర్‌ కుమార్‌ రెడ్డి స్వగృహంలో టిడిపి నాయకుడు చింతపర్తి సిద్దయ్య, ప్రజాశక్తి మండల రిపోర్టర్‌ డేవిడ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రజాశక్తి 2023 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ నిష్పక్షి పాతమైన కథనాలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి, సీనియర్‌ నాయకులు సహదేవ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకులు అశోక్‌, బీసీ నాయకులు శ్రీనివాసులు తదితర కిషోర్‌ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు.