మాడ్రిడ్: బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వైదొలిగాడు. నాదల్ శుక్రవారం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 'బార్సిలోనా నాకు ప్రత్యేకమైన టోర్నమెంట్, ఈ క్లబ్‌ను నేను దత్తత తీసుకున్నాను. ఈ టోర్నమెంట్‌లో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే.. కానీ నేను మానసికంగా, ఫిట్‌గా ఇంకా లేను, అందువల్ల ఈ టోర్నీనుంచి వైదొలుగుతున్నాను' అని పేర్కొన్నాడు. ఎడమ తుంటికి గాయం కారణంగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నుంచి నాదల్ రాకెట్ పట్టలేదు. ఈ క్రమంలో త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లోనైనా రఫెల్ నాదల్ బరిలోకి దిగుతాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నాదల్ రికార్డుస్థాయిలో 14సార్లు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే కెరీర్‌లో తొలిసారి ఏటిపి ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఏటిపి-500 బార్సిలోనా ఓపెన్ ఏప్రిల్ 15-23వరకు స్పెయిన్ వేదికగా జరగనుంది. ఇదే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ టాప్‌సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. 2005లో నాదల్ బార్సిలోనా ఓపెన్‌ను తొలిసారి చేజిక్కించుకొని మొత్తం 12సార్లు ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.










