న్యూఢిల్లీ: షార్ట్‌గన్ ప్రపంచకప్‌కు భారత జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) గురువారం ప్రకటించింది. దోహా వేదికగా జరిగిన షార్ట్‌గన్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం నెగ్గిన పృథ్విరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. ఆల్మట్టిలోని లొనాటోలో జరిగిన శిక్షణ అనంతరం జట్టును ఎంపిక చేసినట్లు ఎన్‌ఆర్‌ఏఐ గురువారం ఓ ప్రకటన వెల్లడించింది. ఇక ఈజిప్ట్‌లోని కైరో వేదికగా ఏప్రిల్ 25 నుంచి మే 5వరకు షార్ట్‌గన్ ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి.
ట్రాప్
పురుషులు: జోరావర్ సింగ్ సంధు, పృథ్విరాజ్ తొండైమాన్, భోవ్‌నేష్ మెండిరత్తా,
మహిళలు: ప్రీతి రజాక్, శ్రేయసి సింగ్, మనీషా కెర్ర్.
స్కీట్..
పురుషులు: అనంత్‌జీత్ సింగ్, గుర్జీత్ సింగ్, మెరురాజ్ అహ్మద్
మహిళలు: గనేమత్, దర్శనా రాథోర్, మహేశ్వరి.










