ఢిల్లీ : ప్రజానుకూల చానల్‌గా గుర్తింపు పొందిన ఎన్‌డిటివి పూర్తిగా కార్పొరేట్ అధినేత గౌతం అదానీ పరం అయ్యింది. ఎన్‌డిటివి వ్యవస్థాపకులు ప్రణరు రాయ్, రాధికరారులు సంస్థలోని తమ షేర్లలో అత్యధిక వాటాలను అదానీకి విక్రయించనున్నట్లు రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చారు. ఎన్‌డిటివిలో వారికి ప్రస్తుతం 37.44 శాతం వాటా ఉండగా.. ఇందులో 32.26 శాతం వాటాను అదానీకి అమ్మేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ చానల్‌లో వారికి 5 శాతం వాటా మిగలనుంది. తొలుత ఈ సంస్థలోని మెజారిటీ వాటాలను దొడ్డిదారిన అదానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ సంస్థలోని వాటాదారులు, ఇన్వెస్టర్లపై ఒత్తిడి పెంచి క్రమంగా వాటాలను పెంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.










