చెన్నై : చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఇక తమ హౌం గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించడంపై సీఎస్‌కే కెప్టెన్ ధోని స్పందించాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధోని మాట్లాడుతూ.. ''నా కెరీర్‌లో చివర దశలో ఉంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. వారు నాపై చూపిస్తున్న ప్రేమ,అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. కానీ మ్యాచ్‌ల్లో మేము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. తనకు చెన్నై సూపర్ కింగ్స్ తో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. సీఎస్కే అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఈ సీజన్ లో తనకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని అన్నాడు. సచిన్‌లా 16 ఏళ్లకే కెరీర్ మొదలు పెడితే ఆటను మరింత ఆస్వాదించవచ్చు'' అని పేర్కొన్నాడు.










