Dec 25,2022 21:33

ఢిల్లీ: గత ఏడాది అద్భుతమైన వఅద్ధి సాధించిన మ్యూచువల్‌ ఫండ్లు 2022లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒడుదొడుకుల నేపథ్యంలో ఎంఎఫ్‌ ఆస్తులు, మదుపర్ల సంఖ్య, నిధుల మొత్తంలో పెద్దగా వఅద్ధి నమోదు కాలేదు.
వచ్చే ఏడాది కూడా ఎంఎఫ్‌ల వఅద్ధి 2022లో తరహాలోనే ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023 చివరి నాటికి ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.44 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఆర్థిక వఅద్ధి, యువ మదుపర్ల భాగస్వామ్యంపైనే ఎంఎఫ్‌ల పెరుగుదల ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, 'అసొసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా సీఈఓ ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. భారత్‌ బలమైన వఅద్ధిరేటు, రానున్న బడ్జెట్‌ ప్రకటనల నేపథ్యంలో ఎంఎఫ్‌ పరిశ్రమ 16-17 శాతం వఅద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ మదుపు మార్గంపై అవగాహన పెరుగుతుండడం కూడా అందుకు దోహదం చేస్తుందన్నారు.
యాంఫీ గణాంకాల ప్రకారం.. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ ఈ ఏడాది నవంబరు చివరి నాటికి రూ.40.37 లక్షల కోట్ల వద్ద రికార్డు స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఆఖరున ఇది రూ.37.72 లక్షల కోట్లుగా ఉంది. 2020లో రూ.31 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. 2022లో వరుసగా పదో ఏడాది ఎంఎఫ్‌ల ఏయూఎం పెరిగింది. ఈ ఏడాది మిల్లీనియల్స్‌, జెన్‌-జీ తరం అత్యధికంగా ఎంఎఫ్‌లలో మదుపు చేశారు. మార్కెట్లలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే లక్ష్యంతో యువ మదుపర్లు ఎంఎఫ్‌లను ఎంచుకుంటున్నారు.
రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, సరఫరా వ్యవస్థలో సమస్యలు, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంతర్జాతీయ ప్రతికూలతలు 2022లో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమపై ప్రభావం చూపాయి. అదే 2021లో నమోదైన జోరుకు ప్రధాన కారణం స్టాక్‌ మార్కెట్ల ర్యాలీనే. ఎంఎఫ్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ ఈ ఏడాది 7 శాతం (రూ.2.65 లక్షల కోట్లు) పెరిగింది. క్రితం ఏడాది ఇది 22 శాతం (రూ.7 లక్షల కోట్లు) వఅద్ధిని నమోదు చేసింది.