Apr 16,2023 13:10

ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత ముంబైలోని వాంఖడేలో మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ధరించనున్న జెర్సీలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పురుషుల జట్టు మహిళల ఐపీఎల్‌లో ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ ధరించిన జెర్సీలను ధరించి బరిలోకి దిగుతుంది. మెన్స్‌ టీమ్‌ ఆటగాళ్లు వుమెన్స్‌ టీమ్‌ జెర్సీలు పట్టుకున్న ఫోటోలను ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. ఇందుకు స్పెషల్‌ జెర్సీ ESAడే అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ మ్యాచ్‌ను 19000 మంది అమ్మాయిలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంఐ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. తొలి ఛాంపియన్స్‌ ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు హాజరయ్యే వారిలో ప్రత్యేక ఆకర్శణగా నిలువనుంది.