May 09,2023 19:01

ముంబయి ఇండియన్స్‌ తో వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆర్‌సిబి భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆర్‌సిబి ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 1 పరుగుకే పరిమితమయ్యాడు. వన్‌ డౌన్‌లో వచ్చిన అనుజ్‌ రావత్‌ (6)ను లెఫ్టార్మ్‌ సీమర్‌ జాసన్‌ బెహ్రెండార్ఫ్‌ అవుట్‌ చేశాడు. డుప్లెసిస్‌ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా... మ్యాక్స్‌ వెల్‌ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. డీకే 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ తో 30 పరుగులు చేయడంతో ఆర్‌సిబి 199 పరుగులు చేసింది.
ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో జాసన్‌ బెహ్రెండార్ఫ్‌ 3, కామెరాన్‌ గ్రీన్‌ 1, క్రిస్‌ జోర్డాన్‌ 1, కుమార్‌ కార్తికేయ 1 వికెట్‌ తీశారు.

  • టాస్‌ గెలిచిన ముంబై

వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే ఇరు జట్లుకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఆర్‌సిబి జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. 
 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్