న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలరీత్యా ఆసీస్‌కు బయల్దేరి వెళ్తున్నాడని, అందువల్ల ఢిల్లీ ఆడే ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని పేర్కొన్నాడు. లక్నోపై డకౌట్ అయిన మార్ష్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 11 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టు శనివారం రాజస్తాన్ రాయల్స్, 11న ముంబై ఇండియన్స్‌తో, 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని హోప్స్ వెల్లడించాడు.










