May 25,2023 11:12

ప్రజాశక్తి-రాయచోటి(అన్నమయ్యజిల్లా) : రాయచోటి వరిగ క్రాస్‌ వద్ద గల విజయ పాల కేంద్రంలో పాలు నిల్వ ఉంచే ట్యాంకర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకి చెందిన టెక్నీషియన్‌ జోగేంద్ర సింగ్‌ (32) విజయ పాల కేంద్రంలోని ట్యాంకర్‌ను రిపేర్‌ చేస్తుండా అది ఒక్కసారిగా పేలింది. దీంతో జోగేంద్ర సింగ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న నాగరాజుకు (45) తీవ్రగాయాలయ్యాయి. నాగరాజును స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి వెంకటరామి రెడ్డి, సిబ్బంది జోగేంద్ర మృతదేహాన్ని ట్యాంకర్‌ నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐలు నరసింహారెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు.