Sep 13,2023 19:32

హైదరాబాద్‌ : వినాయక నవరాత్రులకు హైదరాబాద్‌ నగరం సిద్ధమవుతోంది. ఇక ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు యాత్రికులు నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ క్రమంలో యాత్రికులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.వినాయక నవరాత్రుల సంందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు యోచిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ స్టేషన్‌లో అదనపు టికెట్‌ కౌంటర్లను ఓపెన్‌ చేస్తామన్నారు. యాత్రికులు వీలైనంత త్వరగా టికెట్‌ పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.