దుబాయ్: అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించిన లియోనల్ మెస్సీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు క్లబ్స్ పోటీ పడుతుంటాయి. సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో మెస్సీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సౌదీ ఫుట్‌బాల్ క్లబ్, మెస్సీ మధ్య కాంట్రాక్టు కుదిరిందని అతడి సన్నిహితులు ఏజెన్సే ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పి) వార్తా సంస్థతో చెప్పారు. అదే నిజమైతే మెస్సీ ఏడాదికి రూ.3,300 కోట్లు సంపాదించనున్నాడు. ప్రస్తుతం మెస్సీ జర్మనీకి చెందిన పీఎస్‌జీ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది జూన్ 30 అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. దాంతో, ఈసారి కొత్త క్లబ్‌కు ఆడాలని మెస్సీ అనుకుంటున్నాడట. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ, రొనాల్డో, ఎంబాపే, నెరుమర్ వంటి స్టార్లంతా సౌదీ అరేబియాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మెస్సీ, ఎంబాపే, నెరుమర్ పీఎస్‌జీ తరఫున, రొనాల్డో అల్ నస్రీ క్లబ్ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.










