బ్యూనస్‌ఎయిర్: అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కెరీర్‌లో 800వ గోల్‌ను కొట్టాడు. ఫిఫా ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ.. మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్జెంటీనా జాతీయ గీతం ప్లే చేయగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ తనమార్క్ ఆటతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లో 800గోల్ కొట్టాడు. అతను ఫ్రీ కిక్‌ను గోల్ పోస్టులోకి పంపించగానే స్టేడియం మొత్తం మెస్సీ.. మెస్సీ.. నినాదాలతో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో పనామాను ఓడించింది. వరల్డ్ కప్ తర్వాత మెస్సీ పీఎస్‌జీ క్లబ్‌కు ఆడాడు.










