Jan 06,2023 21:31

క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ఆగ్రోకెమికల్‌ కంపెనీ క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ వరి రైతుల కోసం నూతన ఫంగిసైడ్‌ 'మెంటార్‌'ను విడుదల చేసినట్లు ప్రకటించింది. వరిలో కనిపించే తెగుళ్లు (ఆకు మడత) వంటి వాటిని నియంత్రించడంతో పాటుగా వరి పంటకు అదనపు రక్షణ సైతం అందించి అధిక దిగుబడిని సైతం అందిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. వరిలో సాధారణంగా కనిపించే తెగుళ్ల నియంత్రణకు ఇది తోడ్పడటంతో పాటుగా రైతులకు అత్యంత ప్రయోజనకారిగా నిలువనుందని క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌) సిఎస్‌ శుక్లా పేర్కొన్నారు.