మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నాల్గోరౌండ్‌లో టైటిల్ ఫేవరెట్ ఆటగాళ్లు డానియేల్ మెద్వదెవ్, రుబ్లేవ్ అనూహ్యంగా నాల్గోరౌండ్‌లో పరాజయాన్ని చవిచూశారు. మంగళవారం జరిగిన నాల్గొరౌండ్ పోటీలో మెద్వదెవ్ 6-7(1-7), 4-6తో అస్లాన్ కర్ట్సేవ్(రష్యా) చేతిలో, ఆండీ రుబ్లేవ్ 6-7(6-8), 4-6)తో కరెన్ ఖచనోవ్(రష్యా) చేతిలో వరుససెట్లలో ఓడారు. క్వార్టర్‌ఫైనల్లో ఖచనోవ్.. కార్లోస్ అల్కరాజ్-అలెగ్జాండర్ జ్వెరేవ్ మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.










