ఢిల్లీ : అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్ రాడార్ 2022వ సంవత్సరంలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే స్పోర్ట్ రాడార్‌కు చెందిన నిపుణులు రెగ్యులర్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి కార్యకలపాలపై తమ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించి 28 పేజీల ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2022 ఏడాది క్యాలెండర్‌లో మొత్తంగా 1212 మ్యాచ్‌లపై వివిధ కోణాల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. అయితే అత్యధికంగా ఫుట్ బాల్ నుంచి 775 మ్యాచ్‌లు అవినీతి లేదా ఫిక్సింగ్ రూపంలో జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. బాస్కెట్ బాల్ నుంచి 220 మ్యాచ్‌లు ఉన్నాయి. 75 మ్యాచ్‌లతో టెన్నిస్ మూడో స్థానంలో ఉంది. ఇక క్రికెట్‌లో 13 మ్యాచ్‌లపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది. క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్ లేదా అవినీతి జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇదే విషయమై పీటీఔ స్పోర్ట్ రాడార్‌ను ఒక ప్రశ్న వేసింది. ఈ ఫిక్సింగ్ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ లేక 20 లీగ్ ల్లోనా అని పీటీఐ ప్రశ్నించింది. దీనిక స్పార్ట్ రాడార్ స్పందిస్తూ ఫిక్సింగ్‌గా అనుమానిస్తున్న 13 మ్యాచ్‌లు టీమిండియాకు కానీ, ఐపీఎల్‌కు కానీ సంబంధం లేదని తెలిపింది. దీంతో ఆ 13 మ్యాచ్‌లు ఏవై ఉండొచ్చనే అనుమానాలను ఈ నివేదిక కలిగిస్తోంది.
Sportradar Integrity Services finds number of suspicious matches in 2022 increased 34%, as further application of AI enhances bet monitoring capabilities.
— Sportradar (@Sportradar) March 23, 2023
Read our Annual 2022 Integrity Report ➡️ https://t.co/4SflpVlGUI pic.twitter.com/kRSDW93K3p










