Jul 07,2023 09:59
  • ఆస్ట్రేలియా 263ఆలౌట్‌, వుడ్‌కు ఐదు వికెట్లు
  • యాషెస్‌ సిరీస్‌ మూడోటెస్ట్‌

లీడ్స్‌ : యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్‌ జట్టు రాణించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 263పరుగులకే ఆలౌట్‌ చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ మిఛెల్‌ మార్ష్‌(118) సెంచరీకి తోడు హెడ్‌(39) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఓపెన ర్లు డేవిడ్‌ వార్నర్‌(4), ఉస్మాన్‌ ఖవాజా(13) ఘోరంగా నిరాశపరిచారు. ఆదుకుంటాడనుకున్న లబూషేన్‌(21), 100వ టెస్ట్‌ ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌(22) కూడా త్వరగా పెవీలియన్‌కు చేరారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 85పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మిఛెల్‌ మార్ష్‌ సెంచరీతో కదం తొక్కాడు. మార్ష్‌-హెడ్‌ కలిసి 5వ వికెట్‌కు 160పరుగులు జతచేశారు. 240పరుగులకు మార్ష్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా మరో 23పరుగులు జతచేసిన అనంతరం చివరి ఐదు వికెట్లను చేజార్చుకుంది. మార్క్‌ వుడ్‌కు ఐదు, వోక్స్‌కు మూడు, బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 69పరుగులు చేసింది.కమ్మిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 

స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి)క్రాలే (బి)బ్రాడ్‌ 4, ఖవాజా (బి)వుడ్‌ 13, లబూషేన్‌ (సి)రూట్‌ (బి)వోక్స్‌ 21, స్మిత్‌ (సి)బెయిర్‌స్టో (బి)బ్రాడ్‌ 22, హెడ్‌ (సి)రూట్‌ (బి)వోక్స్‌ 39, మిఛెల్‌ మార్ష్‌ (సి)క్రాలే (బి)వోక్స్‌ 118, క్యారీ (సి)వోక్స్‌ (బి)వుడ్‌ 8, స్టార్క్‌ (బి)వుడ్‌ 2, కమిన్స్‌ (ఎల్‌బి)వుడ్‌ 0, మర్ఫీ (బి)వుడ్‌ 13, బోలండ్‌ (నాటౌట్‌) 0, అదనం 23. (60.4 ఓవర్లలో ఆలౌట్‌) 263పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/42, 3/61, 4/85, 5/240, 6/245, 7/249, 8/249, 9/254, 10/263 బౌలింగ్‌: బోలండ్‌ 11.4-0-58-2, రాబిన్సన్‌ 11.2-2-38-0, మార్క్‌ వుడ్‌ 11.4-4-34-5, వోక్స్‌ 17-1-73-3, మొయిన్‌ 9-1-40-0