రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటలో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని నరేశ్ (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. డీజే సౌండ్ వల్లే నరేశ్‌కు గుండెపోటు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.










