May 18,2023 16:49

మే 20న కేకేఆర్‌తో జరగబోయే తమ లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్రత్యేక జెర్సీని ధరించనుంది. ఎల్‌ఎస్‌జీకి యజమాని అయిన సంజీవ్‌ గొయెంకా కోల్‌కతా ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఛాంపియన్‌ మోహన్‌ బగాన్‌ ఫ్రాంచైజ్‌కు కూడా ప్రధాన వాటాదారు కావడంతో ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్లకు ప్రత్యేక నివాళులర్పించేందుకు ప్రత్యేక జెర్సీని ధరించనున్నట్లు ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్‌ అందాజ్‌.. ఇప్పుడు కోల్‌కతా రంగుల్లో అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్‌ మోహన్‌ బగాన్‌ మరియు సిటీ ఆఫ్‌ జారు (కోల్‌కతా)కు ప్రత్యేక నివాళి అని పేర్కొంది.