Dec 26,2022 21:18

న్యూఢిల్లీ : అనేక ఒటిటిలను ఒకే వేదికపై తెస్తున్న టాటా ప్లే బింగేలో కొత్తగా లయన్స్‌గేట్‌ ప్లేను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇది బింగే కుటుంబంలో చేరిన 19వ యాప్‌గా ఉందని పేర్కొంది. లయన్స్‌గేట్‌ ప్లే స్ట్రీమింగ్‌లో విస్తృత డిజిటల్‌ ప్రీమియర్లు, అన్ని భాషల్లో సమకాలీన కంటెంట్‌ను, బిలియన్‌-డాలర్‌ ఫ్రాంచైజీ చలన చిత్రాలు, టివి షోలు, వెబ్‌ సిరీస్‌లు, ప్రీమియం ఒరిజినల్స్‌ ఇందులో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వీక్షకులు ఇప్పుడు లయన్స్‌గేట్‌ ప్లే సహా ఇతర 18 యాప్‌లను నెలకు రూ.299 చెల్లిస్తే చాలని టాటా ప్లే తెలిపింది.