Feb 16,2023 21:50

కోల్‌కతా: ఫుట్‌బాల్‌ దిగ్గజం, వెటరన్‌ తులసీరామ్‌ బలరామ్‌(86) కన్నుమూశారు. వృద్ధాప్యలేమి, అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు గురువారం వెల్లడించారు. గత నెలలో అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని, పరిస్థితి విషమించడంతో ఐసియుకు తరలించామని, మెదడులో రక్తప్రసరణ నిలిచిపోవడంతో మరణంచినట్లు వారు తెలిపారు. 1936, అక్టోబర్‌ 4న తమిళనాడులో ముత్తమ్మ-తులసీదాస్‌ దంపతులకు అమ్ముగూడ గ్రామంలో బలరామ్‌ జన్మించారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌కు మారినా.. బలరామ్‌ కోల్‌కతాలో ఉండి జాతీయ జట్టు తరఫున ఆడారు. 1951-62మధ్యకాలంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన బలరామ్‌.. 1956, 1960లో భారతజట్టు ఒలింపిక్స్‌లో ఆడిన జట్టులో ఓ సభ్యుడు. జకార్తా వేదికగా 1962లో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో భారతజట్టు జట్టు 2-1గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇక రోమ్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో హంగేరీ, పెరూలపై రెండేసి గోల్స్‌ కొట్టి బలరామ్‌ అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందారు. కెరీర్‌లో 131గోల్స్‌ కొట్టిన బలరామ్‌.. అంతర్జాతీయంగా 14 గోల్స్‌ చేశారు.