Oct 27,2022 20:40

సియోల్‌ : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా లీజె యాంగ్‌ బాధ్యతలు తీసుకున్నారు. దీనికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 54 ఏళ్ల లీజె రెండేళ్ల క్రితమే ఈ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. 2020లో తండ్రి మరణానంతరం లీజె బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. లంచం కేసులో దర్యాప్తు, జైలు శిక్షకు గురైయ్యారు. రెండు నెలల క్రితం దక్షిణ కొరియా ఆయనకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో తాజాగా బాధ్యతలు దక్కాయి.