Jul 09,2023 10:22

కెనడా : కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన సెమీస్ లో లక్ష్యసేన్‌ 21-17, 21-14తో జపాన్‌కు చెందిన స్టార్‌ షట్లర్‌, నాలుగో సీడ్‌ కెంటా నిషిమోటోపై వరుస గేమ్స్‌లో అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షిఫెంగ్‌ తో పోటీ పడనున్నాడు.
మహిళల సింగిల్స్‌ సెమీ పైనల్లో జపాన్‌ కు చెందిన అకానె యమగూచి 21-14, 21-15తో పీవీ సింధును వరుస గేమ్స్‌లో ఓడించి ఫైనల్‌కు చేరింది.