May 04,2023 22:07

జాతీయ బ్యాడ్మింటన్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌
హైదరాబాద్‌: ఆసియా క్రీడల ఎంపికకు జరుగుతున్న జాతీయ బ్యాడ్మింటన్‌ సెలెక్షన్స్‌లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌, మిథున్‌ శుభారంభం చేశారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్‌ 21-14, 21-9తో కేవలం 30నిమిషాల్లోనే రాఘవపై విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని గుత్తా జ్వాలా అకాడమీలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మరో పోటీలో మిథున్‌ మంజునాథ్‌ 22-20, 12-21, 21-11తో మైస్మన్‌ మిరేబాపై చెమటోడ్చి నెగ్గాడు. గ్రూప్‌ాబిలో లక్ష్యసేన్‌తోపాటు మరో ఐదుగురు ప్లేయర్స్‌ ఉండగా.. విజేతగా నిలిచిన షట్లర్‌కు 2పాయింట్లు దక్కనున్నాయి. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ాఏలో అస్మిత ఛాలిహా, ఉన్నతి హుడా, శ్రీయాంషి, ఆకర్షీ కశ్యప్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో మాల్విక బన్సోద్‌, అదితి భట్‌, ఆలీషా నాయక్‌, అనుపమ ఉపాధ్యాయ ఉన్నారు. ఈ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో రాణించిన షట్లర్లు సెప్టెన్‌ 23నుంచి చైనాలోని గ్వాంఝూలో జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.