Feb 19,2023 13:42

ఢిల్లీ : భారత స్టార్‌ క్రికెట్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా మరో రికార్డును విరాట్‌ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ లో 25,000 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరుపై ఉండేది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున కోహ్లీ ఈ ఫీట్‌ సాధించారు. విరాట్‌ కోహ్లీ ఈ ఘనతను కేవలం 549 మ్యాచుల్లోనే సాధించారు. అంతకుముందు సచిన్‌ 25,000 పరుగులను సాధించేందుకు 577 మ్యాచులు తీసుకున్నారు. విరాట్‌, సచిన్‌ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్‌ (588 మ్యాచుల్లో), జాక్వెస్‌ కలిస్‌ (594 మ్యాచుల్లో), కుమార సంగక్కర (608) మ్యాచుల్లో, మహేల జయవర్ధనే(701 మ్యాచుల్లో) 25,000 పరుగులను పూర్తి చేశారు.