May 02,2023 14:30

లక్నో : ఐపిఎల్‌ 2023 లో భాగంగా జరిగిన నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో పై బెంగళూర్‌ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ, గంభీర్‌ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిన నేపథ్యంలో రిఫరీ సీరియస్‌గా స్పందించారు. వారిద్దరి మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 100 శాతం ఫైన్‌ విధించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్‌ ఉల్‌ హాక్‌కు 50 శాతం ఫైన్‌ విధించారు. ఐపిఎల్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.