Nov 29,2022 21:36

న్యూఢిల్లీ : కార్ల తయారీదారు కియా కొత్తగా ప్రీ-ఓన్డ్‌ కార్ల వ్యాపారం 'కియా సిపిఒ'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రత్యేకమైన కియా సిపిఒ అవుట్‌లెట్లలో ప్రీ-ఓన్డ్‌ కార్లను విక్రయించడం, కొనుగోలు చేయడం, ఎక్సేంజీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. 2022 చివరి నాటికి వీటిని 30 అవుట్‌లెట్లకు విస్తరించనున్నట్లు కియా ఇండియా ప్రధాన సేల్స్‌ అధికారి మ్యూంగ్‌ సిక్‌ సోహన్‌ తెలిపారు. కొత్త కియా కార్స్‌ యొక్క మూడొంతులు కంటే ఎక్కువమంది వినియోగదారులు రీప్లేస్మెంట్‌ బయ్యర్స్‌గా ఉన్నారన్నారు. ఈ రంగంలో విస్తృతావకాశాలున్నాయని తాము గుర్తించామన్నారు. తొలుత హైదరాబాద్‌ సహా 14 పట్టణల్లో 15 అవుట్‌లెట్లను తెరిచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.