Feb 17,2023 22:05

చెన్నై: చెన్నై ఓపెన్‌ ఛాలెంజర్స్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లోకి భారత్‌-బ్రిటన్‌ జోడీ ప్రవేశించింది. శుక్రవారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో అర్జున్‌ ఖడే(భారత్‌)ాజే క్లార్క్‌(బ్రిటన్‌) జోడీ 7-5, 4-6, 10-8తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన పెట్రోాఆండ్రూ జోడీపై చెమటోడ్చి నెగ్గారు. మరో సెమీస్‌లో భారత టాప్‌సీడ్‌ జోడీ జీవన్‌ నెడుంఛేజియన్‌-శ్రీరామ్‌ బాలాజీ జోడీ 6-4, 6-7(5-7), 4-10తో సెబాస్టియన్‌-నీనో చేతిలో పోరాడి ఓడారు.