Sep 14,2023 21:10

ఇష్యూ ధరల శ్రేణీ రూ.201-222
హైదరాబాద్‌ : సాయి సిల్స్‌ (కళామందిర్‌) అక్టోబర్‌ 20న ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,201 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌ ధరల శ్రేణీని రూ.210-222గా నిర్ణయించింది. సెప్టెంబర్‌ 22న ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ ముగిస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎండి ప్రసాద్‌ చాలవాడి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భరద్వాజ్‌ రాచమడుగు తెలిపారు. గురువారం వారు వర్య్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. కనీసం 67 (ఒక లాట్‌) షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. పబ్లిక్‌ ఇష్యూలో ఉన్న షేర్లలో సగానికి పైగా 'అర్హతగల సంస్థాగత మదుపర్ల క్యూఐబిల కోసం కేటాయించామన్నారు. మరో 15 శాతం సంస్థాగతయేతర మదుపర్లకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఈ గ్రూపులో కళామందిర్‌, వరమహాలక్ష్మీ సిల్క్స్‌, కెఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ తదితర 54 స్టోర్లను కలిగి ఉంది.