- ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1
అంటాల్య(టర్కీ) : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో జ్యోతి సురేఖ 713పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి అర్ధభాగానికి 36విల్లంబులు సంధించి 353పాయింట్లు సాధించిన జ్యోతి సురేఖ.. ఆ తర్వాత 360పాయింట్లను సాధించింది. మొత్తం మొత్తం 66షాట్స్‌లో 10 పర్‌ఫెక్ట్ షాట్స్ సంధించింది. దీంతో 2015లో కొలంబియాకు చెందిన సారా లోపెజ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. అలాగే 2017లో కొరియాకు చెందిన చేవాన్ సో(709పాయింట్లు) పేర ఉన్న ఆసియా రికార్డును బ్రేక్ చేసింది.










