ఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది.. ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు.. ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి విముఖత చూపించారు. దీన్ని సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.










