గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో అత్యధిక విజయాలతో రికార్డు
ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశం
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి 2వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ ప్రవేశించాడు. మూడోరౌండ్‌లో జకోవిచ్ 6-3, 6-1, 7-6(7-5)తో అన్‌సీడెడ్ వావ్రింకా(స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. తొలి రెండు సునాయాసంగా నెగ్గిన జకోవిచ్‌కు 3వ సెట్‌లో గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకొని జకోవిచ్ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపులో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో 350కు పైగా విజయాలు సాధించిన ఏకైక ఆటగానిగా జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ప్రి క్వార్టర్స్‌లో జకోవిచ్.. పోలండ్‌కు చెందిన యువ ఆటగాడు హుర్క్‌రాజ్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన జకోవిచ్... మూడో గ్రాండ్‌స్లామ్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక 8వ సీడ్ జెన్నిక్ సిన్నర్ 3ా6, 6ా2, 6ా3, 6ా4తో క్వెంటిన్ హయల్స్‌పై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. ఇక రెండోరౌండ్ పోటీలో సిట్సిపాస్ 7-6(7-3), 6-7(2-7), 4-6, 7-6(7-3), 6-4తో ఆండీ ముర్రే(బ్రిటన్)ను ఓడించి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
గార్సియా ఔట్..
మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. 5వ సీడ్ గార్సియా(ఫ్రాన్స్) మూడుసెట్ల హోరాహోరీ పోరులో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన 32వ సీడ్ బుజ్కోవా చేతిలో పోరాడి ఓడింది. శుక్రవారం రాత్రి జరిగిన మూడోరౌండ్ పోటీలో గార్సియా 6-7(0-7), 4-6, 5-7)తో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ సుమారు 2గంటల 33నిమిషాలసేపు సాగింది.










