ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న విద్యా కానుకలు విద్యార్థుల పాలిట వరమనిసర్పంచ్ మోడపోతుల రాము అన్నారు. నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్య కానుక కిట్టులను విద్యార్థులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక శ్రద్ధ వహించిందని అన్నారు. నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలే మార్చారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని కొనియాడారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి చదివి గొప్పవారుగా ఎదగాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉప సర్పంచ్ ఇబ్బులు, ఉపాధ్యాయులు,స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.










