Feb 19,2023 22:15

రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
న్యూఢిల్లీ: రవీంద్ర జడేజా కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌(7/42)తో చెలరేగడంతో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పేకమేడలా కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 61పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 113పరుగులకే ఆలౌటైంది. దీంతో 115పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 26.4 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారతజట్టు 2-0 ఆధిక్యతలో నిలిచింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 20 బంతుల్లో 31 పరుగులు చేసి రనౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నాథన్‌ లియాన్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత చటేశ్వర్‌ పుజారా 100వ టెస్ట్‌లో నిదానంగా ఆడి 74 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ(20), శ్రేయాస్‌ అయ్యర్‌(12) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో ఆంధ్ర కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ 22 బంతుల్లో 23 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు, ఓవర్‌ నైట్‌ స్కోరు వికెట్‌ నష్టానికి 61పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 54 పరుగులు మాత్రమే జోడించి 9వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ మాయాజాలానికి ఆసీస్‌ బ్యాటర్స్‌ క్రీజ్‌లో నిలువలేకపోయారు. జడేజాకు ఏడు, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేస్తే.. భారత్‌ 262పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రవీంద్ర జడేజాకు లభించింది.
స్కోర్‌బోర్డు...
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 264పరుగులు, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263పరుగులు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖవాజా (సి)శ్రేయస్‌ (బి)జడేజా 6, హెడ్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)అశ్విన్‌ 43, లబూషేన్‌ (బి)జడేజా 35, స్టీవ్‌ స్మిత్‌ (ఎల్‌బి)అశ్విన్‌ 9, రెన్‌షా (ఎల్‌బి)అశ్విన్‌ 2, హ్యాండ్‌కోంబ్‌ (సి)కోహ్లి (బి)జడేజా 0, క్యారీ (బి)జడేజా 7, కమిన్స్‌ (బి)జడేజా 0, లియాన్‌ (బి)జడేజా 8, మర్ఫీ (నాటౌట్‌) 3, కుహ్నేమన్‌ (బి)జడేజా 0, అదనం 0. (31.1ఓవర్లలో ఆలౌట్‌) 113పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/65, 3/85, 4/95, 5/95, 6/95, 7/95, 8/110, 9/113, 10/113
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (రనౌట్‌) హ్యాండ్‌కోంబ్‌/క్యారీ 31, కేఎల్‌ రాహుల్‌ (సి)క్యారీ (బి)లియాన్‌ 1, పుజారా (నాటౌట్‌) 31, కోహ్లి (స్టంప్‌)క్యారీ (బి)మర్ఫీ 20, వ్రేయస్‌ (సి)మర్ఫీ (బి)లియాన్‌ 12, శ్రీకర్‌ భరత్‌ (నాటౌట్‌) 23, అదనం 0, (26.4ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 118పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/39, 3/69, 4/98
బౌలింగ్‌: కుహ్నేమన్‌ 7-0-38-0, లియాన్‌ 12-3-49-2, మర్ఫీ 6.4-2-22-1, హెడ్‌ 1-0-9-0