Oct 30,2022 20:38
Jack-Dorsey-focused-on-the-new-social-media-platform
  • ట్విట్టర్‌ సహ వ్యవస్థపాకుడు జాక్‌ డోర్సీ కసరత్తు

న్యూయార్క్‌ : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ట్విట్టర్‌ వెళ్లిన నేపథ్యంలో ట్విట్టర్‌ వ్యవస్థాపకులు ఇప్పుడు సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్‌ డోర్సీ 'నీలాకాశం' (బ్లూస్కై) పేరుతో సరికొత్త సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ అప్లికేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిబీటా వెర్షన్‌ను అతిత్వరలోనే ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ మేరకువారం కిందటే జాక్‌ డోర్సే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'బ్లూస్కై' ప్రొటోకాల్‌ టెస్టింగ్‌ను త్వరలోనే ప్రారంభించనునుట్లు ఆయన తాజాగా వెల్లడించారు. 'డిస్ట్రిబ్యూటెడ్‌ ప్రొటోకాల్‌ అభివఅద్ధి అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందరో భాగస్వాముల నుంచి సమన్వయం అవసరం. ఒక్కసారి నెట్‌ వర్క్‌ను ప్రారంభించామంటే, అప్పుడు ప్రైవేటు బీటా మొదలుపెట్టి, సమస్యలను సరిచేస్తాం'' అని ఆయన అన్నారు.