రోమ్: 2032 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఆతిథ్యానికి ఇటలీ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎఫ్‌ఐజిసి) బిడ్ దాఖలు చేసింది. ఈ మేరకు యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీకి యుఇఎఫ్‌ఏ బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటలీ బిడ్‌ను దక్కించుకున్న పక్షంలో మిలన్, టూరిన్, వెరోనా, జెనోవా, బోలోగ్నా, ఫ్లోరెన్స్, రోమ్, నెఫుల్స్, బారి, కాగ్లియారీలలో టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎఫ్‌ఐజిసి ఆ బిడ్‌లో పేర్కొన్నట్లు యుఇఎఫ్‌ఏ తెలిపింది. అలాగే 2028 లేదా 2032 యూరో టోర్నమెంట్ ఆతిథ్యానికి టర్కీ కూడా బుధవారం బిడ్ దాఖలు చేసిందని పేర్కొంది. అలాగే 2028 యూరో ఆతిథ్యానికి బ్రిటన్, ఐర్లాండ్ ఉమ్మడి బిడ్‌లను సమర్పించాయి. ఈ టోర్నమెంట్ ఆతిథ్యానికి ఈ రెండు దేశాలు బిడ్‌లు దాఖలు చేయడం ఇది ఆరోసారి. అక్టోబర్‌లో రెండు టోర్నమెంట్‌ల ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక ఓట్లు వచ్చిన దేశానికి ఆతిథ్య హక్కులు అప్పగించనున్నట్లు యూరోపియన్ బాడీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ తెలిపింది. ఆతిథ్యానికి సంబంధించి వచ్చిన ప్రతి బిడ్‌ను పరిశీలిస్తామని యుఇఎఫ్‌ఏ ఆ ప్రకటలో పేర్కొంది.










