ముంబయి: వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ఈ మేరకు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈశా అంబానీ-ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కవలల్లో పాపకు అదియా, బాబుకు కఅష్ణ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ''మా కూతురు ఈశా నవంబరు 19న పాప, బాబుకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. వారికి అదియా, కఅష్ణ అని పేర్లు పెట్టారు. వారికి మీరంతా ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం'' అని అంబానీ కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈశా అంబానీ - ఆనంద్ పిరమాల్ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2018 డిసెంబరున వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్‌లో ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ఈ విభాగం కింద ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు, ఫ్యాషన్, జ్యూవెలరీ, ఫుట్‌వేర్, దుస్తులు, జియోమార్ట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.










