ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) :ఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా కమిటీ వేసిన క్యాలెండర్ అన్నమాచార్య ఇంజనిరింగ్ కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి గురువారం అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై, విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ కృషి చేయడం అభినందనీయమన్నారు. సమాజానికి బాధ్యతగల నాయకులను అందించడంలో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. క్యాలెండర్ సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన భావాలకు అద్దం పట్టేలా కనిపిస్తోందని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐకి సహకరించడం అంటే సమాజ హితం కోరే ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టీ.ఎస్ ఏ.ఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా పట్టణ ఎస్.ఐ లక్మీ ప్రసాద్ రెడ్డి, గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణతో పాటు వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలకు ఎస్‌ఎఫ్‌ఐ క్యాలెండర్‌ను అందించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, పట్టణ నాయకులు కార్తీక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.










