ముంబయి : ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. బుధవారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 216 పాయింట్లు కోల్పోయి 62,411కు తగ్గింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 18,560 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు పడిపోయినట్లయ్యింది. జిడిపి అంచనాలకు కోతకు తోడు హెచ్చు ద్రవ్యోల్బణం కొనసాగవచ్చనే ఆర్‌బిఐ ప్రకటన మార్కెట్లను ఒత్తిడికి గురి చేసిందని నిపుణులు పేర్కొన్నారు. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో ఎఫ్‌ఎంసిజి రంగం అధికంగా 0.96 శాతం నష్టపోయింది.










