Dec 01,2022 20:51

న్యూఢిల్లీ : దేశంలోనే తొలి ఆన్‌లైన్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ మార్కెట్‌ ప్లేస్‌ అయినా బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌ కొత్తగా ఇంటర్‌ బ్యాంక్‌ రేట్‌ మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డును విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది భారత్‌లోనే తొలి ట్రూజీరో మార్కప్‌ ట్రావెల్‌కార్డ్‌ అని పేర్కొంది. దీంతో ఇంటర్నేషనల్‌ ప్రయాణికులు ఇంటర్‌బ్యాంక్‌ రేట్ల వద్ద జీరో యాడెడ్‌ మార్కప్‌తో కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. అంటే సెర్చ్‌ ఇంజిన్‌ల వద్ద కనిపించే ప్రత్యక్ష, వాస్తవ రేట్లను పొందవచ్చని తెలిపింది. సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై చేసే విదేశీ లావాదేవీలపై 5 శాతం పైగా ఇంటర్‌బ్యాంక్‌ రేట్లను బ్యాంకులు వసూలు చేస్తుంటాయి.