ప్రజాశక్తి-నిమ్మనపల్లి (అన్నమయ్యజిల్లా): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ రాజగోపాల్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు, మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.










